ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్..మెగాస్టార్‌‌‌‌‌‌‌‌తోనే చివరిసారిగా..!

ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్..మెగాస్టార్‌‌‌‌‌‌‌‌తోనే చివరిసారిగా..!

ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ చేయడానికి కొందరు సెపరేట్‌‌‌‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్లే చేసేస్తున్నారు. స్పెషల్‌‌‌‌ సాంగ్స్‌‌‌‌ అనేవి సినిమాకి అడిషనల్ అట్రాక్షన్ అవుతూ ఉండటంతో పాపులర్ హీరోయిన్లతోనే వాటిని తెరకెక్కిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ‘ఆచార్య’లో కూడా ఇలాంటి ఓ పాట ఉంది. దానిలో మెగాస్టార్‌‌‌‌‌‌‌‌తో కలిసి రెజీనా స్టెప్పులేసింది. అయితే ఇదే తన చివరి ఐటమ్ సాంగ్ అంటోందామె. రీసెంట్‌‌‌‌గా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి రెజీనా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ‘స్పెషల్ సాంగ్స్ చేస్తారా అని చాలా యేళ్ల క్రితం ఎవరో నన్ను అడిగితే.. చిరంజీవి గారితో అయితే చేస్తానని చెప్పాను. ఇప్పుడు కూడా ఆయన కోసమే చేశాను. అంత గొప్ప డ్యాన్సర్‌‌‌‌‌‌‌‌తో కలిసి స్టెప్స్ వేసే చాన్స్ రావడం నిజంగా అదృష్టం. అందుకే ఒప్పుకున్నాను. ఇదే నా మొదటి, చివరి స్పెషల్ సాంగ్’ అని చెప్పింది రెజీనా. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది రెజీనా. అలాగే వెబ్‌‌‌‌ సిరీసులపైనా దృష్టి పెట్టింది. రీసెంట్‌‌‌‌గా ‘రాకెట్ బోయ్స్‌‌‌‌’లో నటించింది. నెక్స్ట్ రాజ్‌‌‌‌, డీకేల ప్రాజెక్ట్‌‌‌‌లో కూడా కనిపించనుంది.