ఓపిక లేనేళ్లు పనులెందుకు చేశారు..ఎమ్మెల్యే రివర్స్ అటాక్

ఓపిక లేనేళ్లు పనులెందుకు చేశారు..ఎమ్మెల్యే రివర్స్ అటాక్

చేసిన పనులకు బిల్లులు రావడం లేదంటూ వరంగల్ అర్బన్ జిల్లాలో టీఆర్ఎస్ సర్పంచ్ బంధువు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పురుగుల మందు తాగడానికి ప్రయత్నించిన హన్మంతరావును నేతలు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గ్రామంలో ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, సీసీ రోడ్లు ఇంకుడు గుంతల పనులు చేశామన్నారు గుంటూర్ పల్లి సర్పంచ్. చాలా రోజులుగా బిల్లులు రావడం లేదని చెప్పారు. అప్పులు తెచ్చి పనులు చేస్తే..బిల్లులు రాక రోడ్డున పడ్డామని అవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు బిల్లులు ఆలస్యం అవడం వాస్తవమేనన్నారు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్. బిల్లులు లేటయితే ఆగమాగం ఎందుకు అవుతున్నారని రివర్స్ అయ్యారు. ఓపిక లేనేళ్లు పనులెందుకు చేయాలని ఎదురుదాడి చేశారు ఎమ్మెల్యే సతీష్ కుమార్.

రాష్ట్రంలో సర్పంచులందరిదీ ఇదే సిచ్యువేషన్. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశారు. బిల్లులు రాక..తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక...రోడ్డున పడుతున్నారు సర్పంచులు. అప్పుల బాధ పడలేక కొంత మంది ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశారు. టార్గెట్ లు పెట్టి పనులు చేయించే ప్రభుత్వం...నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సర్పంచులు.