గచ్చిబౌలి, వెలుగు: అభిమానుల అత్యుత్సాహానికి ఇటీవల సినిమా నటులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ దంపతులకు ఇటువంటి అనుభవమే ఎదురైంది. శనివారం అర్ధరాత్రి అల్లు అర్జున్, తన భార్య స్నేహ రెడ్డితో కలిసి నాలెడ్జ్ సిటీలోని నీలోఫర్ కేప్‌లో టీ తాగేందుకు వెళ్లారు. కేఫ్ నుంచి ఇంటికి వెళ్లేందుకు బయటకు రాగానే, అభిమానులు ఒక్కసారిగా సెల్ఫీలు కోసం ఎగబడ్డారు. దీంతో స్నేహరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ తోపులాటలోనే సెక్యూరిటీ బౌన్సర్లు వారిని సురక్షితంగా కారులోకి తరలించారు. మొన్నటికి మొన్న నిధి అగర్వాల్, హీరోయిన్ సమంత, విజయ్ దళపతి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు.
