
హైదరాబాద్, వెలుగు: దీపావళి స్పెషల్ గా రిలయన్స్ జియో ఫోన్ నెక్ట్స్ ను జియో లాంచ్ చేసింది. పండగకు ఒకటి రెండు రోజుల ముందే అమ్మకాలు మొదలుపెడతామని కంపెనీ వర్గాలు తెలిపాయి. అండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా డెవెలప్ చేసిన ప్రగతి ఓఎస్ ద్వారా ఇది పనిచేస్తుంది. ప్రత్యేకంగా మనదేశం కోసమే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ను జియో, గూగుల్ ఎక్స్‌పర్టులు తయారు చేశారని కంపెనీ వెల్లడించింది.
ఈ హ్యాండ్‌సెట్‌ను ఆంధ్రప్రదేశ్ సిటీ తిరుపతి ప్లాంటులోనే తయారు చేస్తారని ప్రకటించింది. జియో ఫోన్ నెక్ట్స్ లో క్వాల్‌కామ్ ప్రాసెసర్‌ను వాడారు. ఇందులో 5.5 ఇంచుల స్క్రీన్, వాయిస్ అసిస్టెంట్, రీడ్ అలౌడ్, 13 ఎంపీ స్మార్ట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 2జీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ ఉంటాయి. కంపెనీ ఇంకా ధరను ప్రకటించనప్పటికీ, ఇది రూ.3,499 వరకు ఉండొచ్చని తెలుస్తోంది.