టోల్ వసూలుపై రెంటల్ కార్ ఓనర్ల నిరసన

టోల్ వసూలుపై రెంటల్ కార్ ఓనర్ల నిరసన

మహదేవపూర్(కాటారం), వెలుగు: మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద నిబంధనలకు విరుద్ధంగా వాహనదారుల నుంచి టోల్​ఫీజు వసూలు చేస్తున్నారని కాటారం రెంటల్ కార్​ఓనర్లు ఆరోపించారు. గురువారం టోల్ ప్లాజా వద్ద నేషనల్ హైవేపై కార్లను అడ్గుగా పెట్టి, నిరసన తెలిపారు. దీంతో 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి, టోల్ ప్లాజా నిర్వాహకులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

అనంతరం వారు మాట్లాడుతూ.. తాము ఒక రోజులో రెంట్​పై పలుమార్లు టోల్ ప్లాజాను క్రాస్ చేయాల్సి వస్తుందని, ప్రతీసారి టోల్ చెల్లించాలంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ హైవే నిర్మించిన టోల్ ప్లాజాకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాహనదారులకు టోల్​నుంచి మినహాయింపు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నిర్వాహకులు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి శ్రీధర్ బాబు స్పందించి, తమకు న్యాయం చేయాలని కోరారు.