
కరీంనగర్: ఓ టీవీ ఛానల్ జర్నలిస్ట్ మేకల సత్యనారాయణ(35) అలియాస్ సిటీ కేబుల్ సత్యం బ్లాక్ ఫంగస్ తో బాధపడుతూ నిన్న సాయంత్రం చనిపోయాడు. రెండో వేవ్ సమయంలో కోవిడ్ -19 వైరస్ బారిన పడి, కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ సోకింది. కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. కొద్ది నెలలుగా మంచానికే పరిమితం అయ్యాడు. కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ జీవించాడు. శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (CAIMS)కి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
రెండు దశాబ్దాల క్రితం సిటీకేబుల్ లోకల్ న్యూస్ ఛానెల్‌లో కెమెరామెన్‌గా చేరిన సత్యం అనంతరం కరీంనగర్ రూరల్ మండలంలో మైత్రి న్యూస్ ఛానల్‌లో రిపోర్టర్‌గా మారారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన భార్య కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో పనిచేస్తున్నారు. జర్నలిస్టు సత్యం మంచి క్రీడాకారుడు. ప్రతిరోజూ షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ ఆడేవాడు. సత్యం మృతి పట్ల జర్నలిస్టులు, స్థానిక నేతలు సంతాపం ప్రకటించారు. సమాజంలోని అన్ని వర్గాలతో స్నేహపూర్వకంగా మెలిగిన, చైతన్యవంతమైన యువ జర్నలిస్టును తాము కోల్పోయామని రిపోర్టర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా
హైదరాబాద్లో అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం
మెహందీ ఫంక్షన్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డ్యాన్స్