లిక్కర్ షాపులకు రిజర్వేషన్లు.. జీవో విడుదల

V6 Velugu Posted on Sep 21, 2021

  • లిక్కర్ షాపు ల్లో  ఎస్టీ లకు 5, ఎస్సి లకు 10, గౌడ్ లకు 15 శాతం రిజర్వేషన్లు 

హైదరాబాద్: లిక్కర్ షాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఐదు రోజుల క్రితం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్‌ ఇవ్వాలని  నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో లిక్కర్ షాపులు, అమ్మకాలు, ఉత్పత్తి తదితర అంశాలపై చర్చ జరిగింది. మద్యం దుకాణాల విషయంలో రిజర్వేషన్ల అమలు చేయాలని కేబినెట్ లో ఆమోదించారు.  
మద్యం దుకాణాల్లో.. గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలన్న కేబినెట్ నిర్ణయం మేరకు జీవో విడుదల చేశారు. 
 

Tagged Wine Shops, TS Cabinet, telangana liquor, , telangana cabinet decessions, TS Government, Liquor Shops, govt go, ts govt go, liquor shops reservation for gowds, liquor shops reservation for sc’s, liquor shops reservation for st’s

Latest Videos

Subscribe Now

More News