రామగుండం ఎమ్మెల్యే బందిపోటు దొంగ.. కాకా చొరవతోనే సింగరేణి బతికింది: రేవంత్ రెడ్డి

 రామగుండం ఎమ్మెల్యే బందిపోటు దొంగ.. కాకా చొరవతోనే సింగరేణి బతికింది: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ విజయం ఖాయమైందని, ఆడబిడ్డల ఆశీర్వాదంతో.. రామగుండంలో కాంగ్రెస్ గెలవబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.  సింగరేణికి దేశంలో గొప్ప చరిత్ర ఉందని... సింగరేణి ఉత్పత్తే.. దేశం వెలుగులకు కారణని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని  ఉవ్వెత్తున లేపిందే కాంగ్రెస్ అని.. తెలంగాణ ప్రకటన ఆలస్యం అయితే.. ఢిల్లీలో ఒత్తిడి తెచ్చామని తెలిపారు. సబ్బండవర్గాలను ఏకం చేసిందే కాంగ్రెస్ పార్టే అన్నారు. సింగరేణి కార్మికుల పోరాటమే.. తెలంగాణ రాష్ట్రమన్నారు. 60ఏళ్ల ఏండ్ల కలను సాకారం చేసిందే కాంగ్రెస్ అన్నారు. సింగరేణి కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరాయా?..  ఓపెన్ కాస్ట్ మైనింగ్ మూసేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.2023, నవంబర్ 11వ తేదీ శనివారం రామగుండంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.  

 ప్రస్తుతం ఉన్న రామగుండం ఎమ్మెల్యే ఒక  బందిపోటు దొంగని రేవంత్ నిప్పులు చెరిగారు. సింగరేణి ఎన్నికల్లో గెలిచే సత్తా కేసీఆర్ కు లేదని.. అందుకే హైకోర్టుకెళ్లి వాయిదాలు తెచ్చుకున్నారని విమర్శించారు. కాకా చొరవతోనే సింగరేణి బతికిందని చెప్పారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సంవత్సరం తిరిగే లోపు భర్తి చేయాలంటే కాంగ్రెస్ గెలవాలని... పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ5.లక్షలు రావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చి తీరాలన్నారు. రేషన్ షాపులో కాంగ్రెస్.. తొమ్మిది వస్తువులతో కలిపి బియ్య పంపిణీ చేస్తే.. కేసీఆర్ వచ్చి అవేవి ఇవ్వకుండా దొడ్డు బియ్యం మాత్రమే ఇస్తున్నాని మండిపడ్డారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వాలన్నా.. రూ.500లకే ఇంటి సిలిండర్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రేవంత్ రెడ్డి అన్నారు.