జులై 7న బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి

జులై 7న బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్: పీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ రెడ్డి వచ్చే నెల 7వ తేదీన పార్టీ పదవి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన ఆయనను పార్టీ అధిష్టానం పీసీసీ చీఫ్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అనేకమార్లు పార్టీ నేతలతో తర్జన భర్జనలు చేసి.. సుదీర్ఘ కసరత్తు అనంతరం రేవంత్ రెడ్డి సారధ్యంలో కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా ఐదుగురు వర్కింగ్ ప్రసిడెంట్లతోపాటు జంబో కార్యవర్గాన్ని నియమిస్తూ ప్రకటన చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన అసంతృనేతలు భగ్గుమన్నారు.

సీనియర్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి రాజీనామాకు సిద్ధపడగా నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పదవులను ఓటుకు నోటులా అమ్ముకున్నారని.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్ పై తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది. జిల్లాలోనే ఉంటానని  గాంధీ భవన్ మెట్లెక్కబోనని కోమటిరెడ్డి చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. మరో వైపు పీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ రెడ్డి జులై 7న పార్టీ ముఖ్య నేతల సమక్షంలో పదవి బాద్యతలు చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.