సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనుల కోసం రూ.37.40 కోట్లు మంజూరయ్యాయి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. బుధవారం సదాశివపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, జగ్గారెడ్డి మాట్లాడారు. మున్సిపాలిటీలోని ఊబ చెరువు సుందరీకరణ కోసం రూ.1.5 కోట్లు, గాంధీ చౌక్ సుందరీకరణ కోసం రూ.50 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు.
అయ్యప్ప టెంపుల్ నుంచి పీస్ఎంఎల్ వరకు సెంట్రల్ లైటింగ్ కోసం రూ.1.6 కోట్లు, డబుల్ బెడ్ రూం పరిసరాల్లో కనీస సౌకర్యాల కోసం రూ.50 లక్షలు ,హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటుకు రూ.30 లక్షలు, గురునగర్ కాలనీ లో పార్క్ డెవలప్మెంట్ కు రూ.50 లక్షలు మంజూరైనట్లు వివరించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో విలీన గ్రామాల్లో సీఈసరోడ్ల కోసం రూ.2 కోట్లు, సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఇంటర్నల్ సీసీరోడ్లకు రూ.8.26 కోట్లు, వరద నీరు మళ్లింపు కోసం రూ.5.09 కోట్లు, పార్క్ ల అభివృద్ధి కోసం రూ.కోటీ35 లక్షలు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ.2 కోట్లు కేటాయించారని తెలిపారు. త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
