
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగులకు ఆగస్టు వేతనంతో పాటు జులై డీఏ ఇచ్చేందుకు మేనేజ్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు ఉద్యోగుల హెచ్ఆర్ఏ కూడా పెరగడంతో ప్రస్తుతం ఉన్న డీఏకు జులై నెల డీఏ 2.1 శాతం కలపడంతో వారి మొత్తం డీఏ 50 శాతం దాటింది. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థికపరమైన ఊరటగానే చెప్పొచ్చు.
అయితే ఉద్యోగుల డీఏ ఇప్పుడు 50 శాతం దాటినందున 2017 వేతన సవరణ సర్క్యులర్ ప్రకారం ఉద్యోగుల హెచ్ఆర్‌ఏ ను పెంచి అమలు చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న మంగళవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.