నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

కామారెడ్డి, వెలుగు: వెనుక బడిన ఏరియాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయడంతో పాటు, స్థానిక యువతకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ల కింద రూర్బన్ స్కీమ్‌‌‌‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా స్టేట్ గవర్నమెంట్‌‌‌‌కు ఫండ్స్​కేటాయించింది. రూర్బన్ స్కీమ్ కోసం కామారెడ్డి జిల్లాలో జుక్కల్​ మండల కేంద్రాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ  మౌలిక వసతుల కల్పనతో పాటు, ట్రైనింగ్‌‌‌‌ కోసం రూ.180 కోట్ల ఫండ్స్ కేటాయించారు. మూడేండ్లలో పనులు కంప్లీట్ చేయాల్సి ఉన్నా ఇంకా కాలేదు.  స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో కూడా నామమాత్రంగానే ట్రైనింగ్‌‌‌‌లు నిర్వహిస్తున్నారు. ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం వల్లే ఆశించిన ఫలితాలు రావడంలేదనే విమర్శలు ఉన్నాయి. 

129 పనులు ప్రారంభించి..

డీఆర్డీవో ఆధ్వర్యంలో రూర్బన్​ స్కీమ్ పనులు కొనసాగుతున్నాయి. ఆయా ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టారు. జుక్కల్ మండలాన్ని అన్ని రంగాల్లో డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయడంతో పాటు పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునే గోదాములు, మార్కెటింగ్ వసతులు,  ఫ్లాట్ ఫారాలు, హాస్పిటల్, యూత్ ట్రైనింగ్ సెంటర్ బిల్డింగ్, ఆడిటోరియం, స్కూళ్లలో డిజిటల్​ క్లాసులు, కంపౌండ్​వాల్స్, రోడ్లు,  గ్రామాల్లో బస్‌‌‌‌ షెల్టర్లు, పంచాయతీ బిల్డింగ్‌‌‌‌లు వంటివి ఈ స్కీమ్‌‌‌‌లో ఉన్నాయి. అయితే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో దాదాపు129 పనులు ప్రారంభించారు. కానీ ఆరేండ్లు కావస్తున్న అవి పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. 

వృథాగా స్కిల్​డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సెంటర్​

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు రూర్బన్​ స్కీమ్‌‌‌‌లో భాగంగా రూ.90 లక్షలతో స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్ సెంటర్​ నిర్మాణం చేశారు. బిల్డింగ్ కంప్లీట్ అయినప్పటి నుంచి కేవలం నాలుగు బ్యాచ్‌‌‌‌లకు మాత్రమే టైలరింగ్, ఫ్లంబింగ్, ఎలక్ట్రిషియన్ వంటి పలు ఆంశాల్లో  ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వత రెగ్యులర్ ట్రైనింగ్‌‌‌‌లపై ఆఫీసర్లు నిర్లక్ష్యం చేశారు. దీంతో లక్షల రూపాయలతో నిర్మించిన బిల్డింగ్‌‌‌‌ ఇప్పుడు వృథాగా ఉంది. ఇక హైస్కూళ్లలో కూడా డిజిటల్​ క్లాస్‌‌‌‌లు నిర్వహించడం లేదు. అదనపు గదుల నిర్మాణ పనులు కంప్లీట్ చేయాల్సి ఉంది. పంట ఉత్పత్తులు ఆరబోసేందుకు నిర్మించిన ఫ్లాట్​ఫారాలను కూడా వినియోగంలోకి తేవడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

జిల్లాలోని సంక్షిప్త వార్తలు

అక్రమ అరెస్టులపై వినూత్న నిరసన

వర్ని, వెలుగు: బోధన్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన సీఐటీయూ నాయకులు, ఆర్టీసీ కార్మికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మోస్రా మండల తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముందు ప్రజాసంఘాల ప్రతినిధులు కళ్లు మూసుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నేత నన్నేసాబ్ మాట్లాడుతూ పని భారం తగ్గించాలని ఆదివారం సాయంత్రం బోధన్ బస్ డిపో ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారన్నారు. అయితే ఆఫీసర్లు సమస్య పరిష్కరించకుండా అర్ధరాత్రి పోలీసులను ఉసిగొలిపి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు విగ్నేష్, ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేయించడం సిగ్గుచేటన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు సాయిబాబా, మేకల మల్లేశ్‌‌‌‌, స్రవంతి, పుష్ప, శ్యామల, స్వాతి, లక్ష్మి పాల్గొన్నారు.

సంక్షేమ పథకాల్లో అవినీతి పెరిగిపోయింది

బోధన్, వెలుగు: తెలంగాణ గవర్నమెంట్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అవినీతి పెరిగిపోయిందని బీజేపీ నేత వడ్డి మోహన్‌‌‌‌రెడ్డి ఆరోపించారు. సోమవారం పట్టణంలోని శక్కర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో గడపగడపకు బీజేపీ ప్రోగ్రామ్‌‌‌‌ 5వ రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మోహన్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గవర్నమెంట్ అమలు చేస్తున్న దళిత బంధు, డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌ రూం ఇండ్లు ఇతర పథకాలు కమీషన్లు ఇచ్చిన వారికే దక్కుతున్నాయన్నారు. కొన్ని చోట్ల టీఆర్ఎస్ కార్యకర్తలకే అందుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాల కోసం ప్రతి యేట ఫండ్స్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేస్తుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాలు చేపట్టకుండా వాటిని ఇతర స్కీమ్‌‌‌‌లకు వాడకుంటోందన్నారు. అనంతరం బీజేపీ నాయకులు శక్కర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని కాలనీల్లో తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ నాయకులు మేడపాటి ప్రకాశ్‌‌‌‌రెడ్డి, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కొలిపాక బాలరాజు, నాయకులు అడ్లూరి శ్రీనివాస్, న్యావానంది గోపాల్, కిశోర్, సుక్క రాజు, కమలాకర్ పాల్గొన్నారు. 

చదువుతోనే సమాజంలో గుర్తింపు - కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నిజామాబాద్, వెలుగు: చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ముబారక్ నగర్‌‌‌‌‌‌‌‌లోని ఆర్‌‌‌‌‌‌‌‌బీవీఆర్ఆర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం రాజా బహదూర్ వెంకటరాంరెడ్డి  జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌‌‌‌కు కలెక్టర్ చీఫ్‌‌‌‌ గెస్ట్‌‌‌‌గా హాజరై మాట్లాడారు. అనేక ఆంక్షలు  ఉన్న సమయంలోనూ రాజా బహదూర్ వెంకటరాంరెడ్డి విద్య ఆవశ్యకతను గుర్తించి హైదరాబాద్‌‌‌‌లో ప్రత్యేకంగా కాలేజీలు, హాస్టళ్లు నెలకొల్పారని గుర్తుచేశారు. స్థానికంగా ఆయన పేరిట సొసైటీని స్థాపించి అన్ని వసతులతో కూడిన పాఠ
శాలను కొనసాగించడంతో పాటు సామాజిక కార్యక్రమాలు చేపడుతుండడం గొప్ప విషయమని సొసైటీ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్ పర్సన్ అమృతారెడ్డి, గోవర్ధన్‌‌‌‌రెడ్డి, డాక్టర్ దేవేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, స్వరూప్, అమరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సదానంద్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. 

సంచార రక్త సేకరణ వ్యాన్‌‌‌‌ ప్రారంభం

ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ ( ఐఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌) నిధులతో జిల్లాకు అందజేసిన సంచార రక్త సేకరణ వ్యాన్‌‌‌‌ను సోమవారం సొసైటీ జిల్లా ప్రెసిడెంట్‌‌‌‌, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సి.నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాన్‌‌‌‌లో రక్త సేకరణకు ఉపయోగ పడే అన్ని వస్తువులతో పాటు మూడు కోచ్‌‌‌‌లు ఉన్నాయని తెలిపారు. సంచార రక్త సేకరణతో రెడ్ క్రాస్ తమ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, ఈసీ మెంబర్ సూర్యనారాయణ, వెంకట కృష్ణ, నిజామాబాద్ డివిజనల్ చైర్మన్ డాక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీశైలం, వైస్ చైర్మన్ మురళి కృష్ణ, ఎంసీ మెంబర్ శ్రీనివాస్‌‌‌‌రావు పాల్గొన్నారు.

గుండెపోటుతో నిజాం షుగర్స్ కార్మికుడు మృతి

బోధన్​,వెలుగు: పట్టణంలోని శక్కర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికుడు రాజయ్య (56) గుండెపోటుతో మృతి చెందినట్లు మజ్దూర్ యూనియన్ నాయకుడు రవిశంకర్‌‌‌‌‌‌‌‌గౌడ్ తెలిపారు. రాజయ్య ఫ్యాక్టరీలోని కెమికల్ డిపార్టుమెంట్‌‌‌‌లో 28 ఏళ్ల పాటు పనిచేశారని తెలిపారు. ఫ్యాక్టరీ లేఆఫ్‌‌‌‌​ చేసినప్పటి నుంచి జీతాలు రాలేకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని, చివరకు గుండెపోటుతో మృతి  చెందినట్లు తెలిపారు. రాజయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నట్లు తెలిపారు. ఆర్థిక సమస్యలతో ఆవేదన చెందుతూ చాల మంది కార్మికులు చనిపోతున్నారని ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. చనిపోయిన కార్మికులకు కుటుంబాలనైనా ఆదుకోవాలని కోరారు.

సర్పంచ్ ఇంట్లో చోరీ

లింగంపేట, వెలుగు: మండలంలోని అయ్యపల్లి గ్రామ సర్పంచ్ గుడాల శివమ్మ ఇంట్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారని బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివమ్మ కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌‌‌‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి ఆదివారం రాత్రి స్వగ్రామానికి చేరుకున్నారు.  కాగా ఇంటి తలుపులకు బయట నుంచి తాళం వేసి వెళ్లగా లోపలి నుంచి గడియలు పెట్టి ఉండడంతో అనుమానించి ఇంటిని పరిశీలించారు. కప్పు తొలగించి ఉండడాన్ని గమనించి పోలీసలకు సమాచారం అందించారు.శనివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో రూ.14 వేల నగదు, తులంనర బంగారు దోచుకెళ్లినట్లు సర్పంచ్​కుమారుడు శంకరప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్లూస్ టీం సిబ్బంది గ్రామానికి చేరుకుని వేలిము ద్రలను సేకరించారు. కేసు ఫైల్‌‌‌‌ చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై చెప్పారు.