సోయా రైతులను ఆదుకోవాలి అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే తోట

 సోయా రైతులను ఆదుకోవాలి అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే తోట

పిట్లం, వెలుగు : సోయా ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థ నిర్మూలనకు కొత్త పాలసీ తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రసంగించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జుక్కల్ నియోజకవర్గంలో సోయాబిన్​ సాగవుతుందన్నారు.

సోయా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను సభ దృష్టికి తీసుకెళ్లారు. అదునుకు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు కాకపోవడంతో దళారులను ఆశ్రయించి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని బిచ్కుందలో సోయా ప్రాసెసింగ్ యూనిట్​ను ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.