కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హయర్ ఇండియా మార్కెట్లోకి ఎస్8 టీవీలను లాంచ్ చేసింది. ఇవి 55, 65 ఇంచుల్లో లభిస్తాయి. ఈ 4కే టీవీల్లో పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుందని కంపెనీ ప్రకటించింది. ఆల్-స్క్రీన్ డిస్‌ప్లే, స్లీక్ బెజెల్స్ వల్ల టీవీ నాజూగ్గా, స్టైలిష్ గా కనిపిస్తుంది. టీవీ ముందు భాగంలోని 30 వాట్ల స్పీకర్లతో స్పష్టమైన సరౌండ్ సౌండ్ వినొచ్చు. వీటి ధరలు వరుసగా రూ.1.11 లక్షలు, రూ.1.40 లక్షలు.
