Salman Khan - AR Murugadoss: సల్లూ భాయ్తో ఏ ఆర్ మురుగదాస్ ఫిల్మ్..టైటిల్ ఏంటంటే?

Salman Khan - AR Murugadoss: సల్లూ భాయ్తో ఏ ఆర్ మురుగదాస్ ఫిల్మ్..టైటిల్ ఏంటంటే?

టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్(A.R.Murugadoss) తన మూవీస్ తో బాక్సాఫీస్ దగ్గర వండర్స్‌ క్రియేట్‌ చేశారు. గత కొంత కాలంగా సక్సెస్‌తో తిరిగి కంబ్యాక్ ఇవ్వాలని  రీసెంట్గా ఓ ప్రాజెక్ట్‌ను లాక్ చేశారు. 

లేటెస్ట్గా..బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan)తో తన నెక్స్ట్ సినిమా చేయనున్నట్లు ఏఆర్ మురుగదాస్ ప్రకటించాడు. ఈ పవర్ ఫుల్ కాంబినేషన్ కు తోడుగా కిక్, జుడ్వా వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలను నిర్మించిన సాజిద్ నడియడ్‍వాలా (Sajid Nadiadwala) నిర్మాతగా వ్యహరించనున్నారు. తన  కొత్త సినిమా గురించి డైరెక్టర్ మురుగదాస్ నేడు (మార్చి 12) ట్వీట్ చేశారు.

సల్మాన్‌ఖాన్ వంటి లెజెండ్‌తో కలిసి పని చేసేందుకు చాల కాలంగా ఎదురుచూస్తున్నాను.నిర్మాత సాజిద్ నడియడ్‍వాలా వంటి అద్భుతమైన ప్రొడ్యూసర్తో పనిచేయడం చాలా సంతోషం. మరపురాని సినిమా అనుభవం కోసం సిద్ధంగా ఉండండి! మా చిత్రం EID 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది' అంటూ ఆడియన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ మురుగదాస్. 

హీరో సల్మాన్‌ఖాన్ స్పందిస్తూ..“అద్భుత టాలెంట్ ఉన్న ఏఆర్ మురుగదాస్, నా స్నేహితుడు సాజిద్ నడియడ్‍వాలాతో ఓ ఎగ్జైటింగ్ సినిమా కోసం కలిసి పని చేయనున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ భాగస్వామ్యం చాలా ప్రత్యేకమైనది. మీ ప్రేమ, ఆశీర్వాదంతో ఈ జర్నీ కోసం నేను వేచిచూస్తున్నా” అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ కాంబోపై క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. 

ఈ మూవీ సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‍తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే షూటింగ్ కి సంబంధించిన లొకేషన్స్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇండియాలోని కొన్ని లొకేషన్లతో పాటు పోర్చుగల్, యూరోపియన్ దేశాల్లో ఈ మూవీ షూటింగ్ జరగనుందని టాక్.

అంతేకాదు..ఇది తనన కలల ప్రాజెక్ట్ అంటూ నిర్మాత సాజిద్ కూడా ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.సల్లూ భాయ్ తో మురుగదాస్ చేసే చిత్రానికి కిక్-2 టైటిల్‍ను పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి డైరెక్టర్ మురుగదాస్ ఈ మూవీతో అయిన కంబ్యాక్ ఇస్తే చూడాలని తన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.