
హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారనే పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, పోస్ట్ చేసే ప్రతి పోస్టులో డైరెక్టర్ రాజ్ ఉండేలా చూసుకుంటుంది. దానికితోడు వీరు చనువుగా ఫొటోలకు ఫోజులిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వినిపిస్తున్న రూమర్స్ సైతం నిజమనేలా ప్రవర్తిస్తున్నారు. ఇక ఇప్పుడైతే.. వారిద్దరూ కలిసి తమ డేటింగ్, తమ పెళ్లి గురించి హింట్ ఇస్తూనే.. క్లారిటీ కూడా ఇచ్చిసినట్లే తెలుస్తోంది. ఆ ఫోటోలు ఏంటో సామ్ ఇన్‌స్టాగ్రామ్ చూస్తే.. మీకే అర్ధమవుతోంది.
లేటెస్ట్ విషయానికి వస్తే.. సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్తో కలిసి దీపావళిని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా దివాళీ ఫోటోలను సమంత ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ‘నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ అని క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ క్రమంలోనే మరోసారి, సమంత రాజ్ యవ్వారం మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్గా నిలిచింది. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? ఫోటోలు షేర్ చేస్తూ.. వీరిద్దరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సారి హింట్ మాత్రమే కాదు.. చెప్పకనే చెప్పేసారు అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఇందులో సామ్ షేర్ చేసిన ఫొటోల్లో ఇరువురి ఫ్యామిలీ ఉన్నట్లు సమాచారం. డైరెక్టర్ రాజ్ పేరెంట్స్ తో పాటుగా సమంత బ్రదర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, రాజ్ వైఫ్ శ్యామాలి లేకపోవడంతో.. ఇపుడు నెటిజన్లు బలంగా మాట్లాడుకుంటున్నారు.
ఇటీవలే సమంత తన నిర్మాణ సంస్థ నుంచి రిలీజైన ఫస్ట్ మూవీ 'శుభం' వేడుకల్లో కూడా రాజ్ ఉన్నారు. ఆ టైంలో రాజ్ నిడిమోరుతో సామ్ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్లో కూడా షేర్ చేసింది.
"ఇది చాలా కష్టమైన ప్రయాణం. కానీ ఇక్కడివరకూ చేరుకున్నాం. కొత్త ఆరంభాలు. శుభం మే 9న విడుదలవుతుంది " అని తన పెంపుడు జంతువులు హాష్, శాషాతో దిగిన ఫోటోలు, సినిమా షూటింగ్ సమయంలోని క్షణాలు, ఇతర ఫోటోలను ఆమె పంచుకున్నారు. అలాగే, ఈ పోస్ట్ లో 'కొత్త ప్రారంభం' అనే క్యాప్షన్ కూడా పెట్టి రాజ్ ఫోటో ఆసక్తి కలిగేలా చేసింది.
మరోసారి.. అమెరికా వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్లో షేర్ చేసింది. ఓ ఫొటోలో వీరిద్దరూ క్లోజ్‌గా ఉండడం, ఒకరిపై ఒకరు చేయి వేసుకుని, ఎంతో ఆప్యాయంగా నవ్వుకుంటూ వెళ్తున్నారు. ఇంకో ఫొటోలో సమంత, రాజ్ ఒక రెస్టారెంట్‌లో పక్కపక్కనే కూర్చుని, స్నేహితులతో లంచ్ చేస్తున్నారు. ఇలా సమంత పోస్ట్ చేసే ఫొటోలే కాదు.. పెట్టె క్యాప్షన్స్ కూడా అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరి డేటింగ్, పెళ్లికి సంబంధించిన రూమర్స్ ఊపందుకుంటున్నాయి.
అయితే, ఈ ఊహాగానాలపై ఇప్పటివరకు సమంత ఎక్కడ స్పందించలేదు. కానీ, తమ కొత్త ఫోటోలు మాత్రం షేర్ చేస్తూనే ఉంది. ఇలా వీరి కథ ఎక్కడినుంచి ఎక్కడివరకు వెళుతుందో చూడాలని ఆమె ఫ్యాన్స్ మరియు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఇకపోతే, సమంత, రాజ్ కలిసి 'ది ఫ్యామిలీ మ్యాన్', 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌ల కోసం పనిచేశారు. ఆమె ఇప్పుడు అతనితో 'రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్'లో పనిచేస్తున్నారు. అంతేకాదు.. వీరిద్దరూ చెన్నై సూపర్ ఛాంప్స్ అనే పికిల్‌బాల్ జట్టుకు కూడా భాగస్వాములు. మరి వీరిద్దరి మధ్య వచ్చే రూమర్స్కి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందనేది తెలియాల్సి ఉంది. నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న సమంత ‘మా ఇంటి బంగారం’త్వరలోనే స్టార్ట్ అవ్వనుంది.