
ప్రస్తుతం సమాజంలో యువత ఒత్తిళ్లకు తట్టుకుపోలేక తమ జీవితాలనే సగంలోనే ముగించేస్తున్నారు. తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకొని వందేళ్ల జీవితాన్ని అర్థాంతరంగ ముగించేస్తున్నారు. అలా తప్పుడు నిర్ణయాలు తీసుకునే వారికి స్టార్ బ్యూటీ సమంత(Samantha) ఒక మెసేజ్ ఇచ్చారు.
Samantha's Important Message To Teenagers About Making Wrong Decisions!! pic.twitter.com/RkJ9ywDRSD
— Viral Briyani (@Mysteri13472103) September 20, 2023
ఇందులో భాగంగానే ఆమె తన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత గురించి మాట్లాడుతూ.. యువత తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆపాలనుకుంటున్నాను. ఆపుతాను కూడా. చాలా మంది యువత తమకు ఓ కష్టం రాగానే జీవితం అక్కడితో అయిపోయింది అనుకుంటారు. నాకు కూడా అలాంటి పరిస్థితులు వచ్చాయి. అలాంటివి మీకు రాకూడదని కోరుకుంటున్నాను. నిజం చెప్పాలంటే కష్టసమయంలోనే అసలైన జీవితం మొదలవుతుంది. నేను ఇలా మీ ముందుకు వస్తానని, ఇన్ని కష్టనష్టాలను ఎదుర్కొంటానని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నేను గతంలోకంటే శక్తివంతంగా, పాజిటివ్‌గా, సంతోషంగా ఉన్నాను. రోజురోజుకి అది పెరుగుతోంది కూడా.. అని చెప్పుకొచ్చాడు సమంత.
ప్రస్తుతం ఈ వీడియో నట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. కష్టాలకు భయపడి ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు సమంత జీవితాన్ని స్పూర్తిగా తీసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.