
అక్టోబర్ 31 నుండి నవంబర్ 1 వరకు దక్షిణ కొరియాలోని జియోంగ్జులో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సమ్మిట్లో శామ్‌సంగ్ ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను చూపించనుంది. అలాగే ఈ ఫోన్ ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలనీ, ముఖ్యంగా దక్షిణ కొరియా టెక్నాలజీ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాలని చూస్తుంది.
ఈ లాంచ్ గురించి కొరియాలో ఇప్పటికే భారీ అంచనాలు, పుకార్లు వినిపిస్తున్నాయి. శామ్‌సంగ్ మాత్రం దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. రెండు మడతలతో ఉండే ఈ ట్రై-ఫోల్డ్ ఫోన్ చిన్న స్మార్ట్‌ఫోన్ నుండి టాబ్లెట్ అంత పెద్ద స్క్రీన్‌గా మారుతుంది. APEC సమ్మిట్లో ఈ ఫోన్ ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి వస్తుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీని ధర సుమారు $3,000 అంటే దాదాపు రూ. 2.64 లక్షలు ఉండొచ్చని అంచనా.
Samsung ట్రై-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు:
అంచనాల ప్రకారం ఈ ట్రై-ఫోల్డ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో రన్ అవుతుందని, 16GB RAM, 256GB స్టోరేజ్‌తో రావచ్చని భావిస్తున్నారు. గెలాక్సీ Z ఫోల్డ్ 7లో ఉన్నట్లుగా, ఈ ఫోన్ కూడా శామ్‌సంగ్ చాలా సన్నని, స్ట్రాంగ్ హింజ్ డిజైన్‌తో ఉంటుంది. అలాగే 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 2019లో గెలాక్సీ ఫోల్డ్‌తో మొదలైన ఫోల్డబుల్ ఫోన్ల ప్రయాణంలో Samsungకి ఇదోక కీలక అడుగు.
అయితే, మార్కెట్లో విడుదలైన మొట్టమొదటి ట్రై-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ ఇదేం కాదు. హువావే కంపెనీ ఇప్పటికే మేట్ XT అల్టిమేట్ డిజైన్ పేరుతో ట్రై-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది, దాని ధర RM 12,999 అంటే సుమారు రూ.2,70,711.