
హైదరాబాద్: యాదవులు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సదర్ మేళాను పాతబస్తీలో మంగళవారం (అక్టోబర్21) ఉప్పర్ గూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగ సందర్బంగా యాదవులు జరుపుకునే అతిపెద్ద ఉత్సవం సదర్ ను పాతబస్తీలో చంచల్ గూడ జైల్సమీపంలోని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం సెంటర్ లో బ్యాండు, బాజాలతో డప్పు సప్పుల్లతో ఘనంగా నిర్వహించారు. సదర్ మేళా కు హాజరైన మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.
సదర్ ఉత్సవాలకు చారిత్రక నేపథ్యం ఉంది. నిజాం ప్రభుత్వ కాలంనుంచి యాదవులు దీపావళి మరుసటి రోజున ఈ సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతియేటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉప్పర్ గూడ యాదవ సంఘం సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసింది. సదర్ ఉత్సవాల్లో యాదవుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున్న ప్రజలు తరలివచ్చాయి. సదర్ ఉత్సవాల సందర్భంగా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ట్రాఫిక్ పోలీసులు.
►ALSO READ | వాహనదారులకు బిగ్ అలర్ట్: హైదరాబాద్లో రేపు (అక్టోబర్ 22) ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు