
నల్లగొండ జిల్లాలో జోరుగా మత్తు గోలీల అక్రమ దందా సాగుతోంది. ఎలాంటి డిస్క్రిప్షన్ లేకుండా మత్తు మాత్రలను విక్రయిస్తున్న ముఠాతోపాటు కొనుగులు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో తొర్రూర్ మండలం కేంద్రంలోని ఓ మెడికల్షాపునుంచి కొనుగోలుచేసి అక్రమంగా విక్రియస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..
నల్గొండలో అక్రమంగా మత్తు మాత్రలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఈగల డ్రగ్ అండ్ కంట్రోల్ బోర్డు అధికారుల తోపాటు నల్లగొండ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి మత్తు మాత్రలను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు.మంగళవారం ( అక్టోబర్21) నల్లగొండలో మత్తు మాత్రల ముఠాపై ఈగల్ఫోర్స్, నల్లగొండ పోలీసులు జరిపిన దాడిలో స్పాస్మోప్ప్రాక్సివాన్ ప్లస్, ట్రామడాల్ టాబ్లెట్లు అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ప్రధాన పెడ్లర్ మద్ జబినుల్లా, మెడికల్ షాపు ఓనర్ దారం కృష్ణసాయితోపాటు 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 9మంది పరారీలో ఉన్నారు. వీరిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చరేశారు.
మహ్మద్ జబీనుల్లా అనే వ్యక్తి గత కొంత కాలంగా మత్తు మాత్రలకు బానిపై కొనుగోలు, అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తొర్రూర్ లోని ఓ మెడికల్ షాపునుంచి ఎలాంటి డిస్క్రిప్షన్ లేకుండా మాత్రలు కొనుగోలు చేసి విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.