
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న హైవోల్టేజ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మళ్లీ డకౌట్ అయ్యాడు. పడిక్కల్ ఔటయ్యాక క్రీజ్ లోకి వచ్చిన శాంసన్ జడేజా వేసిన బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీనికంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా శాంసన్ డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ కెరీర్ లో శాంసన్ పరమ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటి వరకు 142 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన శాంసన్ 10 సార్లు డకౌట్ అయ్యాడు. అందులో ఎనిమిది సార్లు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడినప్పుడు డకౌట్ కావడం గమనార్హం. రాజస్థాన్ తరపున ఆడినప్పుడు ఎక్కువసార్లు డకౌట్ అయిన ఆటగాడిగా శాంసన్ నిలిచాడు.
ఈలిస్టులో శాంసన్ తరువాత - షేన్ వార్న్, స్టువర్ట్ బిన్నీ 7 సార్లు, అజింక్యా రహానే 5 - సార్లు డకౌట్ అయ్యారు. దీంతో నెటిజన్లు శాంసన్ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఇలాంటి రికార్డులు మనకొద్దు అంటూ పోస్టులు పెడుతున్నారు.