
- శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి
హైదరాబాద్, వెలుగు: క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్ శివసేనా రెడ్డి అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు త్వరలోనే క్రీడా పాలసి తీసుకురానున్నట్లు తెలిపారు. సిటీలోని బడన్‌పేట్‌లో గరుడ లాక్రోస్ అకాడమీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జపాన్ జరిగిన వరల్డ్ లాక్రోస్ చాంపియన్ షిప్‌లో ఇండియా టీమ్‌కు కెప్టెన్ గా వ్యవహరించిన తెలంగాణ ప్లేయర్ అనుదీప్ రెడ్డి సన్మానించారు.
ఒలింపిక్ గేమ్ లాక్రోస్ అకాడమీని హైదరాబాద్ లోనే ఉండటం సంతోష కరమని చెప్పారు. 2028 ఒలింపిక్ గేమ్స్ టార్గెట్‌గా లక్ష్యంగా క్రీడాకారులను తీర్చిదిద్దాలన్నదే ఈ అకాడమీని లక్ష్యమని తెలంగాణ లాక్రోస్ అసోషియేషన్ టెక్నికల్ డైరెక్టర్ పొన్నా శబరీష్ తెలిపారు. దేశంలోనే మొదటి సారి తెలంగాణ లో ఈ అకాడమీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.