కృష్ణమ్మ కోసం..

కృష్ణమ్మ కోసం..

కొత్త తరహా కాన్సెప్టులు, డిఫరెంట్ రోల్స్‌‌తో  తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సత్యదేవ్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘కృష్ణమ్మ’ మూవీ ఒకటి.  కొరటాల శివ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వి. వి. గోపాలకృష్ణ దర్శకత్వంలో  కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఆమధ్య ఫస్ట్‌‌లుక్‌‌తో మెస్మరైజ్ చేసిన సత్యదేవ్.. నిన్న టీజర్‌‌‌‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సాయి ధరమ్ తేజ్ ఈ టీజర్‌‌‌‌ని రిలీజ్ చేసి టీమ్‌‌కి బెస్ట్‌‌ విషెస్ చెప్పాడు.

రా అండ్ రస్టిక్‌‌గా ఉన్న  విజువల్స్ ఆకట్టు కున్నాయి. సత్యదేవ్ రగ్డ్ లుక్‌‌లో కనిపిస్తు న్నాడు. ‘ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎలా పుట్టామో ఎవరికీ తెలీదు. ఎప్పుడు పుట్టినా, ఎలా పుట్టినా పుట్టిన ప్రతివాడికీ ఏదో ఓ కథ ఉండే ఉంటుంది. కథ నడక, నది నడత ప్రశాంతంగా సాగిపోవాలంటే ఎవ్వడూ కెలకకూడదు’ అంటూ బ్యాగ్రౌండ్‌లో వినిపించిన సత్యదేవ్ డైలాగ్ కథలోని ఇంటెన్సిటీని తెలిపింది. కాలభైరవ బీజీఎం, సత్యలోని ఆవేశం సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. విజయవాడ నగరంలో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్‌‌కి, ఓ విలన్‌‌కి మధ్య జరిగే సంఘర్షణే ‘కృష్ణమ్మ’ సినిమా అని, షూటింగ్ పూర్తిచేసి పోస్ట్‌‌ ప్రొడక్షన్‌‌లో ఉన్నామని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్‌‌ చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.