V6 News

సర్పంచ్ ఎన్నికలకు భద్రత కట్టుదిట్టం : ఎస్పీ శ్రీనివాసరావు

సర్పంచ్ ఎన్నికలకు భద్రత కట్టుదిట్టం : ఎస్పీ శ్రీనివాసరావు
  • ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల, వెలుగు : సర్పంచ్ ఎన్నికలకు భద్రత కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నేడు జరగనున్న మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ఆఫీసులో పోలీస్ ఆఫీసర్లు, సిబ్బందికి ఎన్నికల డ్యూటీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ బూతుల్లో భద్రత రూట్ మొబైల్ టీంలు, రూట్ ఇన్​చార్జిలు, క్యూఆర్​ టీమ్​​, సైక్లింగ్ ఫోర్స్, స్పెషల్ సైక్లింగ్ ఫోర్స్ అన్ని రకాల ప్రత్యేక బృందాలు చేపట్టాల్సిన పనులపై వివరించారు. అభ్యర్థులు, ఏజెంట్లు, రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా డ్యూటీ నిర్వహించాలన్నారు. 

పోలింగ్ కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, లిక్కర్, క్యాష్ పంపిణీ అక్రమాలపై నిఘా పెట్టాలన్నారు. ప్రతి ఓటర్ స్వేచ్ఛగా ఓటు వేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు సమాచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగులయ్య, ఆర్ఐ వెంకటేశ్, సీఐ శీను, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.