జైపూర్, వెలుగు: ప్రతీ ఉద్యోగి నిజాయితీగా ఉండాలని జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఈడీ చిరంజీవి సూచించారు. సోమవారం ఎస్టీపీపీలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను పురస్కరించుకొని సత్యనిష్ఠ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా ఆ దేశంలో అవినీతి ఉండకూడదని, మన దేశంలో విజిలెన్స్ అధికారుల అవగాహన కార్యక్రమాల వల్ల కొంతమేర అవినీతి తగ్గిందన్నారు.
మన సంస్థలో అవకతవకలు జరిగితే విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం విజిలెన్స్ విభాగాధిపతి రామబ్రహ్మం, అధికారులతో కలిసి విజిలెన్స్ పోస్టర్ఆవిష్కరించారు. జీఎంలు నరసింహారావు, మదన్మోహన్, ఏఐటీయూసీ పిట్ సెక్రెటరీ సత్యనారాయణ, సీఎంఓఏఐ బ్రాంచ్ సెక్రెటరీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
