మియాపూర్, చందానగర్ లో రెండు ఆలయాల్లో చోరీ

మియాపూర్, చందానగర్ లో రెండు ఆలయాల్లో చోరీ

చందానగర్/మియాపూర్, వెలుగు: చందానగర్​లోని సాయిబాబా, మియాపూర్​లోని సంతోషిమాత ఆలయాల్లో వేర్వేరుగా చోరీ జరిగింది. చందానగర్​లోని సాయిబాబా ఆలయంలో గురువారం అర్ధరాత్రి రెండు హుండీలు, మేనేజర్​ టేబుల్​లో నగదు చోరీకి గురయ్యాయి. అక్కడే పనిచేస్తున్న వాచ్​మన్​ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మియాపూర్ లోని సంతోషిమాత సాయిబాబా ఆలయంలో హుండీలు మాయమయ్యాయి. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయింది.