
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదలైన ఈ సినిమా ఓవర్సీస్ లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. విదేశాల్లో ఈ మూవీ ఇప్పటి వరకు రూ.300కోట్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అమెరికా, బ్రిటన్, యూఏఈ, ఆస్ట్రేలియాల్లో రెండు వారం కూడా పఠాన్ హవా కొనసాగింది. 2013లో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న షారుఖ్.. మళ్లీ పదేండ్ల తర్వాత ఆ స్థాయి విజయాన్ని దక్కించుకున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన పఠాన్ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇందులో షారుఖ్ ఖాన్ రా ఏజెంట్‌గా నటించగా.. అతనిగా జోడీగా దీపికా పదుకొనే కనిపించింది. జాన్ అబ్రహం విలన్ రోల్ లో కనిపించాడు.