మొబైల్ టార్చి లైట్ తో వైద్యం..కౌటాల పీహెచ్ సీలో ఇన్వర్టర్ లేక తిప్పలు

మొబైల్ టార్చి లైట్ తో  వైద్యం..కౌటాల పీహెచ్ సీలో  ఇన్వర్టర్ లేక తిప్పలు

 కాగజ్ నగర్, వెలుగు: ఇన్వర్టర్​ లేకపోవడంతో సెల్​ఫోన్​ టార్చ్​ లైటు వెలుతురులో డాక్టర్లు ట్రీట్​మెంట్​ చేయాల్సి వచ్చింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తుమిడిహెట్టికి చెందిన నాగపురి లవ్ కుశ్ అనే యువకుడిని మంగళవారం సాయంత్రం పాము కాటు వేసింది. కుటుంబీకులు కౌటాల పీహెచ్ సీకి తీసుకెళ్లారు. 

సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఇన్ పేషెంట్ వార్డులో డాక్టర్ పవన్ కల్యాణ్, స్టాఫ్ నర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇదే సమయంలో కరెంటు పోయింది. ఇన్వెర్టర్​ లేకపోవడంతో పేషెంట్​ వెంట వచ్చిన వాళ్లు సెల్ ఫోన్లలో టార్చ్ లైట్లను ఆన్ చేశారు.

 ఆ వెలుతురులో బాధితుడికి ఇంజక్షన్​ ఇచ్చి కాగజ్​నగర్​కు రిఫర్​ చేశారు. ఇదే సమయంలో చింతల మానేపల్లి మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన మెస్రం సునీత పురిటి నొప్పులతో వచ్చింది. ఆమెకు కూడా సెల్ ఫోన్ వెలుతురులోనే ట్రీట్​మెంట్ అందించారు. కరెంటు వచ్చిన కొద్దిసేపటికే ఆమె బాత్ రూమ్ కు వెళ్లి అక్కడే డెలివరీ అయి మగ బిడ్డకు జన్మనిచ్చింది.