వర్ష బొల్లమ్మ, మేఘ లేఖ లీడ్ రోల్స్‌లో ప్రశాంత్ కుమార్ దిమ్మల రూపొందించిన వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ ఫస్ట్ సీజన్ గతేడాది ఈటీవీ విన్‌లో విడుదలై సక్సెస్ టాక్‌ను తెచ్చుకుంది. జనవరి 8నుంచి సెకండ్ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ ‘ఈ సిరీస్ నాకు చాలా ప్రత్యేకం.
ఇంత అద్భుతమైన ఎమోషన్ ఉన్న స్టోరీకి నన్ను ఎంపిక చేసినందుకు డైరెక్టర్ ప్రశాంత్‌కి థాంక్యూ. సీజన్ 3 కూడా చేయాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది. మేఘ లేఖ మాట్లాడుతూ ‘చంద్రిక పాత్రలో చేయగలనని నమ్మిన ప్రశాంత్‌కు థ్యాంక్స్. కనకంగా వర్షకు మంచి పేరొచ్చింది.
ఈ సెకండ్ సీజన్‌తో ఆడియెన్స్‌ను మరింత అలరిస్తాం’ అని చెప్పింది. దర్శకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ‘ఈ సిరీస్‌తో జీవితం అంటే ఏంటో నేర్చుకున్నా. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఇందులోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అందరికీ నచ్చుతాయి. సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుని చేశారని నిర్మాతలు కోవెలమూడి సత్య సాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ అన్నారు. నటులు రమణ భార్గవ్, ప్రియదర్శిని, సౌమ్య, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, ఈటీవీ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి, బిజినెస్ హెడ్ సాయి కృష్ణ పాల్గొన్నారు.
