శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలవుతోంది. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
‘అమ్మాయి అచ్చ తెలుగు సంప్రదాయ సుందరి.. సౌభాగ్యలక్ష్మి పోలిక, అబ్బాయి మాటకారి.. మోహనాంగుడే మరి తానున్న చోటే వేడుక.. చూసేటి కళ్లకంతా చూడముచ్చట ముద్దైన జంట వీరటా.. ప్రేమన్న ఊహ కూడా లేదు ఇచ్చట.. ఉందల్లా స్నేహమేనట.. భల్లే భల్లే.. బాగుందిలే.. ఈ రెండు మనసుల కూడిక.. మాయే చేసిందిలే, మంత్రం వేసిందిలే..’ అంటూ సాగిన మెలోడీ ఆకట్టుకుంది.
విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్తి రాసిన లిరిక్స్ హర్ట్ టచ్చింగ్‌గా ఉన్నాయి. హరి చరణ్ పాడిన తీరు ఇంప్రెస్ చేస్తోంది. ఇందులో శర్వానంద్, సాక్షి వైద్య మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేరళలోని పచ్చని ప్రకృతి సౌందర్యం నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట విజువల్ ట్రీట్‌లా ఉంది. ఈ చిత్రంలో శ్రీవిష్ణు ప్రత్యేక పాత్రలో నటించగా, సత్య, సునీల్, సుదర్శన్, సంపత్ రాజ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
