వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘సరస్వతి’. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించడంతో పాటు సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి ఆమె నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ ‘హై- కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. సహకరించిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్.
నటిగానే కాక దర్శకనిర్మాతగా వ్యవహరిస్తుండడంతో ఈ చిత్రం నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది. త్వరలోనే మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాం’ అనిచెప్పారు. జీవా, ప్రకాష్ రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక, రావు రమేష్, సప్తగిరి, తులసి, దేవీ ప్రసాద్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
