కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి ఉండదు

కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి ఉండదు

కాంగ్రెస్ పార్టీ  లేకుండా  ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు  ఉండబోదన్నారు  NCP చీఫ్  శరద్ పవార్. ఇటీవల  జరిగిన రాష్ట్ర  మంచ్  మీటింగ్ లో  కూటమి అంశంపై చర్చించలేదన్న ఆయన.. ఒకవేళ  కూటమి ఏర్పాటు  చేస్తే.. కాంగ్రెస్ ను  కలుపుకుని  వెళ్తామన్నారు. ఒక  సామూహిక నాయకత్వ  అవసరం  ఉందన్నారు.. ఈ కూటమిని  తాను లీడ్  చేయాలని  గతంలో కూడా అనుకున్నానని  చెప్పారు  పవార్.  ఈ నెల  22న ...8 రాజకీయపార్టీల నేతలు సమావేశమయ్యారు.  దేశంలోని  ప్రస్తుత పరిస్థితులపై  చర్చించారు.