
మీరు కూడా రాత్రులు అటూ ఇటూ తిరుగుతూ నిద్రలేక గడుపుతున్నారా... ఉదయం నిద్ర లేచిన తర్వాత రాత్రంతా నిద్రపోలేదని అనిపిస్తుందా..? మీ వైఫై రౌటర్ మీ నిద్రను మింగేస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. అవును మీ రూంలో ఉండే వైఫై రౌటర్ ఇన్‌స్టాలేషన్ నుండి ఆన్‌లోనే ఉంటుంది ఇంకా ఇంటి చుట్టూ మొత్తం వైఫై సిగ్నల్‌లను వ్యాపింపజేస్తుంది. సమాచారం ప్రకారం వైఫై electromagnetic radiation మన నిద్రపై చాల ప్రభావం చూపిస్తుందని కొన్ని పరిశోధనలు బయటపెట్టాయి. దింతో రాత్రి నిద్రపోతున్నప్పుడు వైఫైని ఆఫ్ చేయాలా వద్దా అనే ప్రశ్న తలెత్తుతుంది ?
ఈ విషయంపై RMIT యూనివర్సిటీ 2024 సంవత్సరంలో ఒక అధ్యయనం నిర్వహించింది. కొందరు ప్రజలను ఒక వారం పాటు WiFi దగ్గర నిద్రపోయేలా చేసింది. దింతో అందులోని 27% మందిలో నిద్రలేని లక్షణాలు కనిపించాయి. అదేవిధంగా 2021 సంవత్సరంలో ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో 2.4 GHz WiFi సిగ్నల్స్ ఎలుకలను ఎక్కువసేపు మేల్కొని ఉంచేలా చేసిందని, దింతో గాఢ నిద్ర తగ్గిందని కనిపెట్టింది. అయితే WHO & ICNIRP దీనిని ఖండించాయి. WiFi రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుందని, మనిషి నిద్రపై ప్రభావం చూపదని చెబుతున్నాయి. దీనిబట్టి మనిషి నిద్రపై WiFi ప్రభావం గురించి నిపుణులలో చాల తేడాలు ఉన్నాయని తెలుస్తుంది, కానీ రెండు విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటిది WiFi రేడియేషన్ ఖచ్చితంగా ఉంటుంది, అది తక్కువ స్థాయిలో ఉన్నకూడా. రెండవది ఖచ్చితంగా మానసిక ప్రభావం ఉంటుంది.
WiFi రేడియేషన్ నిద్రను ప్రభావితం చేస్తుందా అంటే ఖచ్చితమైన సమాధానం చెప్పకపోవచ్చు. కానీ దీనిని నోసెబో ప్రభావం అంటారు. దీనిలో WiFi రేడియేషన్ ఒకరి శరీరాన్ని ప్రభావం చేయకపోయినా, WiFi శరీరాన్ని ప్రభావితం చేస్తుందనే ఆందోళన నిద్రకి అంతరాయం కలిగిస్తుంది. వైఫై electromagnetic radiation ప్రభావం అందరిపై కనిపించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కొంతమంది నిద్రకు ఇబ్బంది కలిగిస్తుంది.
రాత్రిపూట వైఫై రౌటర్‌ను ఆఫ్ చేయడం వల్ల నిద్రపోవడంతో పాటు డేటా ఇంకా కరెంట్ బిల్ కూడా ఆదా అవుతుంది. ఇది కాకుండా, మీరు రాత్రిపూట వైఫై రౌటర్‌ను ఆఫ్ చేస్తే మీ రౌటర్ ఎక్కువకాలం పాటు పనిచేస్తుంది. వైఫై రేడియేషన్ నిద్రను ప్రభావం చేస్తుందా లేదా అనే దానిపై నిపుణులలో రకరకాల అభిప్రాయాలు ఉన్నగాని రాత్రిపూట వైఫైని ఆఫ్ చేయడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. వైఫై ఆఫ్ చేసినప్పుడు రేడియేషన్ గురించి మీ మనస్సులో భయం తగ్గొచ్చు.