ఎయిర్ బేస్‌‌‌‌లో తీయడం గొప్ప ఎక్స్ పీరియన్స్

ఎయిర్ బేస్‌‌‌‌లో తీయడం గొప్ప ఎక్స్ పీరియన్స్

వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్‌‌ సింగ్ తెరకెక్కించిన ఎయిర్ ఫోర్స్ యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్‌‌’. సోనీ పిక్చర్స్‌‌తో కలిసి సిద్దు ముద్దా నిర్మించారు. మార్చి 1న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రొడ్యూసర్  సిద్దు ముద్దా, కో ప్రొడ్యూసర్ నందకుమార్ మాట్లాడుతూ ‘శక్తి ప్రతాప్ సింగ్ తీసిన షార్ట్ ఫిల్మ్ మాకు, వరుణ్‌‌కు చాలా నచ్చి సినిమా చేయాలనుకుంటున్న సమయంలో సోనీ పిక్చర్స్‌‌ రావడంతో తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌‌గా తీశాం. దర్శకుడి విజన్ క్లియర్‌‌‌‌గా ఉంది. అలాగే వీఎఫ్ఎక్స్ పై కూడా మంచి కమాండ్ ఉండడంతో సినిమా చాలా గ్రాండ్‌‌గా వచ్చింది.

గ్వాలియర్ ఎయిర్ బేస్‌‌లో షూటింగ్ చేశాం. అందుకే విజువల్స్ అంత నేచురల్‌‌గా వచ్చాయి. రియల్ ఎయిర్ బేస్‌‌లో షూట్ చేయడం ఒక గొప్ప ఎక్స్ పీరియన్స్. షూటింగ్ టైమ్‌‌లో ఎంతో సపోర్ట్ చేసిన ఎయిర్‌‌‌‌ ఫోర్స్ అధికారులు సినిమా చూశాక ఫుల్ హ్యాపీ.  ఏం చెప్పామో అదే తీశామని ప్రశంసించారు. దేశభక్తితో పాటు వరుణ్, మానుషి పాత్రల మధ్య వుండే రిలేషన్‌షిప్ కథలో కీలకంగా ఉంటుంది.

క్కీ జే మేయర్ తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. సినిమాకు హిందీలోనూ మంచి రెస్పాన్స్ వుంది. ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం.  సైనికుల త్యాగాలని, ధైర్య సాహసాలని ప్రేక్షకులకు చూపించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.