సిద్దిపేట రూరల్, వెలుగు: లైసెన్సుడ్ సర్వేయర్ -2 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో జరిగిన పరీక్ష తీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. పరీక్షకు 153 మంది అప్లై చేసుకోగా 130 మంది హాజరయ్యారని, 23 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంట సర్వే ల్యాండ్ ఏడీ వినయ్ కుమార్, డిగ్రీ కాలేజ్ సిబ్బంది ఉన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి
విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాలతో వండిన రుచికరమైన భోజనం పెట్టాలని కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం కేసీఆర్ నగర్ లో ఉన్న బీసీ బాలుర గురుకుల స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు అందజేస్తున్న భోజనాన్ని తనిఖీ చేశారు. అన్ని రిజిస్టర్లను చెక్ చేశారు. అనంతరం మాట్లాడుతూ కామన్ మెనూ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.
