
- తాజా పాలు, పాల ఉత్పత్తులతోపాటు నిత్యావసరాలు డోర్ డెలివరీ
హైదరాబాద్: స్వచ్చమైన తాజా పాలు, పాల ఉత్పత్తుల బ్రాండ్ సిద్స్ ఫార్మ్ తెలంగాణ వాసుల కోసం ప్రత్యేకంగా యాప్ ను విడుదల చేసింది. పాలు, పాల ఉత్పత్తులతోపాటు నిత్యావసరాలు కూడా డోర్ డెలివరీ సేవలు అందించాలని సిద్స్ ఫార్మ్ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. తొలుత హైదరాబాద్ నగర వాసులకు ఈ సేవలను అందించనున్నారు. ప్రతి రోజూ రాత్రి 10 గంటల లోపు ఆర్డర్ చేస్తే మరుసటి దినం ఉదయం 7 గంటలకు తమ ఇంటి ముంగిట వాటిని అందిస్తామని సిద్స్ ఫార్మ్ ప్రకటించింది. ఈ యాప్‌ను ప్లేస్టోర్, ఐఓఎస్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కరోనా మహమ్మారి జీవితాలపై గణనీయమైన మార్పు తీసుకొచ్చిన నేపధ్యంలో తెలంగాణ వాసుల కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని సిద్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు కిశోర్ ఇందుకూరి తెలిపారు. కరోనా వచ్చాక ఆన్ లైన్ లావాదేవీలు బాగా పెరిగాయని.. ఇవి చాలా సౌకర్యవంతంగా ఖర్చు లేనివిగా ఉండడం వల్ల తక్కువ కాలంలోనే ఆదరణ పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దైనందిన జీవితం హడావుడి పెరిగిపోయిన నేపధ్యంలో స్వచ్ఛత, తాజాదనం ఉన్న సరుకులు ఇంటి ముంగిటకే వస్తే చాలా వరకు ఊరట కలుగుతుందని అలాగే సమయం ఆదా అవుతుందన్నారు. తమ సంస్థ ద్వారా అతి స్వచ్ఛమైన పాలను అందించామని, తమ పాలలో హార్మోన్లు, నిల్వ కారకాలు, యాంటీ బయాటిక్స్ లేకపోవడం వల్ల అతి తక్కువ కాలంలో జనాదరణ లభించిందని ఆయన గుర్తు చేశారు. తమ బ్రాండ్‌కు తెలంగాణ ప్రాంతంలో 100కు పైగా స్టోర్లు ఉన్నాయని అలాగే బిగ్‌బాస్కెట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వేదికల ద్వారా కూడా అందుబాటులో ఉందన్నారు.