V6 News

ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేయాలి : జీఎం మునిగంటి శ్రీనివాస్

ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేయాలి : జీఎం మునిగంటి శ్రీనివాస్

నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించే సింగరేణి ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని శ్రీరాంపూర్ ​ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ సూచించారు. వేడుకల ఏర్పాట్లపై గురువారం జీఎం ఆఫీస్​లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ.. సింగరేణి ఆవిర్భావ వేడుకలను ప్రగతి స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, అన్ని విభాగాల అధికారులు తమకు కేటాయించిన పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. వేడుకలను వీక్షించడానికి వచ్చిన వారికి అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. 

23న ఉదయం 11 గంటలకు ప్రగతి స్టేడియంలో జెండా ఆవిష్కరణ, స్టాల్స్ ఓపెనింగ్, సాయంత్రం 5.30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉద్యోగుల సన్మానం, ఉత్తమ గృహాలకు బహుమతులు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎ సత్యనారాయణ, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్ రెడ్డి, ఏరియా ఇంజనీర్ టి.రమణ రావు, ఏజెంట్లు కుర్మ రాజేందర్, జి.రవి కుమార్, డీజీఎంలు అనిల్ కుమార్, రాజన్న, ఆనంద్ కుమార్, హరి నారాయణ, రవీందర్, మల్లయ్య, ఏరియా రక్షణాధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.