గోదావరిఖని, వెలుగు: బొగ్గు నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు రవాణా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి సూచించారు. గురువారం రామగుండం రీజియన్‌లోని ఆర్జీ-1, ఆర్జీ-2 ఏరియాల్లో ఆయన పర్యటించారు. నిర్మాణంలో ఉన్న కొత్త సీహెచ్‌పీ బంకర్ పనులను పరిశీలించారు. ఆర్జీ ఓసీ-3 గనిని వ్యూ పాయింట్ ద్వారా పరిశీలించారు.
అనంతరం సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్‌ను సందర్శించి ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు సాధించిన రెస్క్యూ జట్టు సభ్యులను అభినందించారు. రామగుండం-1 ఏరియాలోని జీడీకే-5 ఓపెన్‌కాస్ట్ గనిని సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, ఎం.తిరుమలరావు, ఈడీ(కోల్ మూవ్‌మెంట్) బి.వెంకన్న, జీఎం(కోఆర్డినేషన్, మార్కెటింగ్) టి.శ్రీనివాస్, ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3, అడ్రియాలా ప్రాజెక్టుల జీఎంలు లలిత్ కుమార్, బండి వెంకటయ్య, మధుసూదన్, కొలిపాక నాగేశ్వరరావు, జీఎం(రెస్క్యూ) శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
