
కోల్బెల్ట్, వెలుగు : కాసీపేట బొగ్గు గనికి పూర్వ వైభవం తీసుకురావడానికి కార్మికులు, ఉద్యోగులు కృషి చేయాలని ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం మందమర్రి ఏరియాలోని కాసీపేట-–1 బొగ్గుగనిలో రెండు కొత్త పనిస్థలాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కొత్తగా అందుబాటులోకి వచ్చిన రెండు పని స్థలాలతో బొగ్గు ఉత్పత్తి వేగవంతమవుతుందన్నారు.
రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతకు అందరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాసీపేట గ్రూప్ ఏజెంట్ రాంబాబు, మేనేజర్ డి.సతీశ్, సేఫ్టీ ఆఫీసర్ నిఖిల్ అయ్యర్, డిప్యూటీ మేనేజర్ వెంకటేశ్, సర్వేయర్ ప్రభాకర్, ఇంజినీర్ రామకృష్ణ పాల్గొన్నారు.