మాస్టర్ ప్లాన్ను పక్కాగా అమలుచేయాలి : కలెక్టర్ గరీమా అగ్రవాల్

మాస్టర్ ప్లాన్ను పక్కాగా అమలుచేయాలి : కలెక్టర్ గరీమా అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలని ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. అమృత్ 2.O పథకం కింద సిరిసిల్ల మున్సిపాలిటీ ఎంపిక కాగా.. మాస్టర్ ప్లాన్ అమలుకు మొదటి కన్సల్టేటివ్ వర్క్ షాప్‌‌‌‌ను కలెక్టరేట్‌‌‌‌లో వివిధ శాఖల అధికారులతో శనివారం రివ్యూ మీటింగ్‌‌‌‌ నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్‌‌‌‌లో చేపట్టబోయే అభివృద్ధి పనులకు చేసిన ప్రణాళికల వివరాలు అందించాలన్నారు. సమావేశంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, జీఐఎస్ హబ్ డీటీసీపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశ్వినియాదవ్, వరంగల్ డీటీసీపీవో ఏడీ జ్యోతి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డీటీసీపీవో అన్సారి, సిబ్బంది 
పాల్గొన్నారు.

రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లను నిబంధనల మేరకు కొనుగోలు చేయాలని ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారుసిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్‌‌‌‌‌‌‌‌లో  వడ్ల కొనుగోలు సెంటర్​ను ఆమె సందర్శించారు.