కిడ్నీ మార్పిడి చేయించుకున్న.. సీఐకి బ్యాచ్‌‌‌‌‌‌‌‌మేట్స్ ఆర్థిక సాయం

కిడ్నీ మార్పిడి చేయించుకున్న.. సీఐకి బ్యాచ్‌‌‌‌‌‌‌‌మేట్స్ ఆర్థిక సాయం

కరీంనగర్ క్రైం, వెలుగు: 2009 బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఎస్‌‌‌‌‌‌‌‌ఐలు మానవత్వం చాటుకున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న బ్యాచ్‌‌‌‌‌‌‌‌మేట్‌‌‌‌‌‌‌‌ సీఐ వరప్రసాద్‌‌‌‌‌‌‌‌కు రూ.5,14,000 ఆర్థిక సాయం అందజేశారు.

 ఈ మొత్తానికి సంబంధించిన చెక్‌‌‌‌‌‌‌‌ను బ్యాచ్ సభ్యులు స్వయంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆయన నివాసంలో అందజేశారు. వరప్రసాద్ ను కలిసిన వారిలో ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు బగ్గని శ్రీనివాస్(వరంగల్ రేంజ్), జి.శ్రీనివాస్ వర్మ, ఎ.మధుసూదన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జీకే ప్రసాద్ (హైదరాబాద్ రేంజ్) ఉన్నారు.