ఉజ్జయిని ఆలయంలో రక్షాబంధన్ పూజలు

ఉజ్జయిని ఆలయంలో రక్షాబంధన్ పూజలు

మధ్యప్రదేశ్ ఉజ్జాయినీ ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. రక్షాబంధన్ సందర్భంగా అమ్మవారికి ఒక కోటి 25 లక్షల లడ్డూలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి భక్తులుపెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల అంతరాయాలు కలగడంతో ఉత్సవాలు నిర్వహించుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అవాంతరాలేవీ లేకపోవడంతో భారీ ఎత్తున ఉత్సవాలు జరిగాయి. ఒక్క మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాఖీ పండగకు ఆడపడుచులకు లడ్డూలను ప్రసాదంగా అందిస్తామని ఆలయ పూజారి తెలిపారు.