ఉత్పత్తి లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలి : మునిగంటి శ్రీనివాస్

ఉత్పత్తి లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలి : మునిగంటి శ్రీనివాస్

నస్పూర్, వెలుగు : 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని జీఎం మునిగంటి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. శుక్రవారం జీఎం ఆఫీసులో శ్రీరాంపూర్ ఏరియా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖర్చు తగ్గించడం, ఉత్పత్తిని పెంచడం, బొగ్గు నాణ్యతలో మెరుగుదల, భద్రతా చర్యలు, పర్యావరణ మెరుగుదల తదితర అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు సరైన సమయంలో బొగ్గు రవాణా చేయాలన్నారు. నాణ్యమైన బొగ్గు రవాణా చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ విభాగం వారు భద్రతా చర్యలను బలోపేతం చేయాలని చెప్పారు. సమావేశంలో ఎస్వోటు జీఎం ఎన్.సత్యనారాయణ, ఏజీఎం (ఫైనాన్స్) బీభత్స, ఓసీపీ పీవోలు వెంకటేశ్వరరెడ్డి, చిప్ప వెంకటేశ్వర్లు, ఇన్​చార్జి ఏరియా ఇంజినీర్ సాంబశివరావు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.