శ్రీశైలం డ్యామ్ నుంచి నో వాటర్

శ్రీశైలం డ్యామ్ నుంచి నో వాటర్

ఎండాకాలం నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం తెలంగాణ, ఏపీకి నాగార్జున సాగర్ నుంచి కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్ఎంబీ) నీటి కేటాయింపులు చేసింది. రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించింది. మినిమమ్​డ్రా లెవెల్​తో సంబంధం లేకుండా నీటిని తీసుకునేందుకు ఓకే చెప్పింది. 

రెండు రాష్ట్రాలకు కామన్​ ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్​లో వాటర్ ఇప్పటికే డెడ్ స్టోరేజీ లెవెల్​కు చేరుకున్నాయి. శ్రీశైలంలో ప్రస్తుతం 809.40 అడుగుల దగ్గర 33.957 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. దీంతో శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే అవకాశం లేదని త్రిసభ్య కమిటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. నాగార్జున సాగర్​లో 509.90 అడుగుల దగ్గర 131.499 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. సాగర్​లో మినిమమ్​డ్రా లెవెల్ 505 అడుగుల నుంచి కూడా నీళ్లను తీసుకునేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సాగర్​ నుంచి 14 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు వాడుకునేందుకు అందుబాటులో ఉన్నట్టు బోర్డు స్పష్టం చేసినట్టు సమాచారం. ఆ మినిమమ్​ డ్రా లెవెల్​తో సంబంధం లేకుండా 500 అడుగుల నుంచి కూడా నీటిని తీసుకునేందుకు సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలిసింది.