SSC నోటిఫికేషన్ విడుదల.. 2861 పోస్టులు.. డిగ్రీ ఉన్నోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

SSC నోటిఫికేషన్ విడుదల.. 2861 పోస్టులు.. డిగ్రీ ఉన్నోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో సబ్ ఇన్​స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభమైంది. వచ్చే నెల 16వ తేదీతో అప్లికేషన్ ప్రాసెస్ ముగియనున్నది. 

పోస్టుల సంఖ్య: 2861. 

పోస్టులు:
సీఆర్​పీఎఫ్– పురుషులు (అన్ రిజర్వ్​డ్–  407, ఈడబ్ల్యూఎస్– 101, ఓబీసీ– 272,  ఎస్సీ– 151,  ఎస్టీ–75).
సీఆర్​పీఎఫ్ –మహిళలు (అన్ రిజర్వ్​డ్– 10, 
ఈడబ్ల్యూఎస్–02,- ఓబీసీ– 06,  ఎస్సీ–03,  ఎస్టీ–23-)
బీఎస్ఎఫ్ – పురుషులు (అన్ రిజర్వ్​డ్-– 87, 
ఈడబ్ల్యూఎస్-– 21, ఓబీసీ-– 57, ఎస్సీ– 31,  ఎస్టీ–16-)
బీఎస్ఎఫ్ – మహిళలు (అన్ రిజర్వ్​డ్-– 04, 
ఈడబ్ల్యూఎస్–01, -ఓబీసీ–03,  ఎస్సీ–02,- ఎస్టీ–01-)
ఐటీబీపీ – పురుషులు (అన్ రిజర్వ్​డ్-– 85, ఈడబ్ల్యూఎస్-– 18,  ఓబీసీ-– 52,  ఎస్సీ– 32,- ఎస్టీ–11-)
ఐటీబీపీ – మహిళలు (అన్ రిజర్వ్ డ్–15,- ఈడబ్ల్యూఎస్–03,- ఓబీసీ-–09, ఎస్సీ–06,- ఎస్టీ-–02)
సీఎస్ఐఎఫ్– పురుషులు (అన్ రిజర్వ్​డ్– 473,- ఈడబ్ల్యూఎస్-–116,  ఓబీసీ–314,- ఎస్సీ– 175,- ఎస్టీ–86-)
సీఎస్ఐఎఫ్ – మహిళలు (అన్ రిజర్వ్​డ్– 53,- ఈడబ్ల్యూఎస్–13,- ఓబీసీ-–35, ఎస్సీ–19,- ఎస్టీ–10-)
ఎస్ఎస్​బీ – పురుషులు (అన్ రిజర్వ్​డ్–30,- ఈడబ్ల్యూఎస్–07,- ఓబీసీ–14,- ఎస్సీ–15,- ఎస్టీ–05-)
ఎస్ఎస్​బీ – మహిళలు (అన్ రిజర్వ్​డ్–06,- ఈడబ్ల్యూఎస్–01,- ఓబీసీ-–04, ఎస్సీ–0- ఎస్టీ–0-)

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా సమాన అర్హత ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న​అభ్యర్థులు కూడా అర్హులే. అప్లికేషన్ల ప్రక్రియ ముగిసే తేదీ నాటికి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 20 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. 2000, ఆగస్టు 02వ తేదీ కంటే ముందుగానీ, 2005, ఆగస్టు 1వ తేదీ తర్వాత గానీ జన్మించిన వారై ఉండకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా. 

అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 26.  

లాస్ట్ డేట్: అక్టోబర్ 16 . 

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.100. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్​టీ), ఫిజికల్ ఎండురెన్స్ టెస్ట్ (పీఈటీ), డీటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (డీఎంఈ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

సీబీటీ ఎగ్జామ్ డేట్:  నవంబర్ – డిసెంబర్ 2025. 

పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

ఎగ్జామ్ ప్యాటర్న్: కంప్యూటర్ బేస్డ్​ ఎగ్జామినేషన్​లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–I, పేపర్–II ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో అడుగుతారు. ప్రశ్నలు ఇంగ్లిష్​, హిందీ మాధ్యమంలో ఇస్తారు. పేపర్-–Iలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. సెక్షన్–-Iలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, సెక్షన్–-I-I లో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్​నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, సెక్షన్–IIIలో  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, సెక్షన్–IVలో ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 50 ప్రశ్నలు 50 మార్కులకు ఇస్తారు.   పేపర్–-IIలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ పై ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200  ప్రశ్నలు 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.  పేపర్–I, పేపర్–II లో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి .25 మార్కులు కోత విధిస్తారు. 

కనీస అర్హత మార్కులు: అన్ రిజర్వ్​డ్ 30 శాతం, ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ 25 శాతం, ఇతర అన్ని కేటగిరీ అభ్యర్థులకు 20 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.