ఈ వీధి కుక్కకు క్యాన్సర్.. ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లు

ఈ వీధి కుక్కకు క్యాన్సర్.. ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లు

సమిష్టి కృషికి హృదయపూర్వక ఉదాహరణగా ఇటీవల ఓ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని చిల్కూరు సమీపంలో ఒక వీధి కుక్క భయంకరమైన ప్రమాదం నుండి బయటపడింది. దానికి కారణం సహృదయ ఫౌండేషన్ MAUD స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌. కొన్ని రోజుల క్రితం గాయాలు, ఇతర అనారోగ్యం, తీవ్రమైన పోషకాహార లోపంతో సహా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుక్కను రక్షించిన ఒక వ్యక్తి.. సహృదయ ఫౌండేషన్‌కు చేరుకున్నారు.

తక్షణ జోక్యం ఆవశ్యకతను గుర్తించిన సంస్థ అరవింద్ కుమార్‌.. అభ్యర్థనపై వేగంగా స్పందించారు. అనారోగ్యంతో ఉన్న వీధికుక్కను రక్షించేందుకు సంగారెడ్డి నుంచి వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఆ కుక్కను వెటర్నరీ నిపుణుల సంరక్షణలో ఉంచారు. దానికి వైద్యులు కొన్ని టెస్టులు చేయగా.. కుక్కకు క్యాన్సర్ ప్రారంభ దశలో ఉందని, ట్రాన్స్మిసిబుల్ వెనిరియల్ ట్యూమర్ (TVT)తో బాధపడుతుందని తేలింది. దీంతో వ్యాధిని నిర్మూలించేందుకు కీమోథెరపీ చికిత్స కూడా చేపిస్తున్నారు.

ALSO READ :ఏంటీ.. ఈ నవ్వారు మంచం లక్ష రూపాయలా.. ఈ యాపారం ఏదో బాగుందే..

"మేము చిల్కూర్ సమీపంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఒక వీధికుక్కను సహ్రుదయ్ ఎఫ్ కాల్ ఆధారంగా రక్షించాం" అని అరవింద్ ఓ ట్వీట్ లో తెలిపారు. శరీరమంతా గాయాలైన ఆ కుక్కకు క్యాన్సర్ ప్రారంభ దశలో ఉందని, కీమోథెరపీ కూడా స్టార్ట్ చేశారని చెప్పారు. ఆ కుక్క చాలా ధైర్యం గలదని, త్వరలోనే కోలుకుంటుందని ఆశిస్తున్నానని ఆయన ఆకాంక్షించారు.