ఏంటీ.. ఈ నవ్వారు మంచం లక్ష రూపాయలా.. ఈ యాపారం ఏదో బాగుందే..

ఏంటీ.. ఈ నవ్వారు మంచం లక్ష రూపాయలా.. ఈ యాపారం ఏదో బాగుందే..

భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు  నులక మంచం లేదా నవ్వారు మంచాలు ఉండేవి.   చాలా మంది  ఇంటి ముందు ఈ మంచాలపై కూర్చొని బాతాఖాని వేసుకుంటారు.  ప్రస్తుత రోజుల్లో ఎవరికీ అంతా ఓపిక.. తీరిక ఉండకపోవడంతో వీటి వినియోగం తగ్గుముఖం పట్టింది.  పూర్వ కాలంలో ప్రతి ఇంట్లో నవ్వారు మంచాలు ఉండేవి. ప్రస్తుతం వీటికి ఇక్కడ  అంత డిమాండ్ లేదు.  కాని విదేశాల్లో భారతీయ మంచాలకు మంచి డిమాండ్ ఉంది.  దీంతో మంచి మంచి డిజైన్ లతో తయారు చేస్తున్నారు.    దీనిని గమనించిన అమెరికన్ ఇ కామర్స్ వెబ్ సైట్ ఎట్సీలో భారతీయ మంచాలు అమ్మడవుతున్నాయి.  

అమెరికాకు చెందిన ఈ–కామర్స్ సంస్థ ఎట్సీ, తమ ఆన్​లైన్​ స్టోర్​లో నవారు మంచం కూడా ఉంది. దాని విలువ అక్షరాలా ఒక లక్ష పన్నెండు వేల ముప్పై రూపాయలుగా ఉంది. మనదేశంలో తక్కువ ధర పలికే ఈ మంచం అమెరికాలో అంత రేటు ఉండటం ఏంటా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రొడక్ట్​ వివరాల్లో ఎట్సీ ఈ మంచం గురించి ఇలా రాసింది.. అందంగా అలంకరించిన భారతీయ సంప్రదాయ పడక మంచం. 

ALSO READ :ఈ వీధి కుక్కకు క్యాన్సర్.. ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లు

దీని పొడవు 72 అంగుళాలు, వెడల్పు 36 అంగుళాలు అని. అయితే, ఇంత రేటు ఉన్నా, ఇప్పటికే 82 మంచాలు అమ్ముడుపోయాయట. అంతేకాదు.. ఎట్సీ సైట్​లో వేర్వేరు రకాల మంచాలు కూడా ఉన్నాయి. కొన్ని మంచాలు నవారుతో ఉంటే, మరికొన్ని తాళ్లతో అల్లిన మంచాలు. మరి వాటి రేటు ఎంతో? అంటున్నారు ప్రజలు.