
మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ 18 ఏళ్ల విద్యార్థి 26 ఏళ్ల స్కూల్ టీచర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నర్సింగ్‌పూర్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఎక్సలెన్స్ స్కూల్ విద్యార్థి అయిన సూర్యాంష్ టీచర్ తనపై కంప్లైంట్ చేసిందని ద్వేషం పెంచుకొని ఈ దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో జరిగిందని, సూర్యాంష్ కొచార్ పెట్రోల్ బాటిల్ తీసుకుని టీచర్ ఇంటికి వెళ్లి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుండి పారిపోయాడు.
10 నుండి 15 శాతం కాలిన గాయాలతో బాధితురాలిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోందని, కాలిన గాయాలు తీవ్రంగా ఉన్న ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. సూర్యాంష్ కొచార్ అలాగే టీచరుకి గత రెండు ఏళ్ళకి పైగా ఒకరికొకరు తెలుసు. సూర్యాంశ్ టీచర్ పట్ల ప్రేమను పెంచుకున్నాడని పోలీసులు తేల్చారు.
ALSO READ : హైవే పక్కన రెస్టారెంట్ నడపాలంటే లంచం ఇవ్వాలా..?
రెండేళ్ల క్రితం ఆగస్టు 15న స్కూల్లో జరిగిన కార్యక్రమానికి టీచర్ చీర ధరించి వచ్చింది, అప్పుడు సూర్యాంష్ ఆమె పై అసభ్యంగా కామెంట్స్ చేసాడు. దింతో ఆమె ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేసింది. చివరికి అతడిని స్కూల్ నుండి తొలగించడంతో వేరే స్కూల్లో చదువుతున్నాడు. ఈ విషయంపై అతను కోపం పెంచుకొని ఈ దాడికి ప్లాన్ చేశాడు. సెక్షన్ 124A, ఇతర IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని బాధితురాలి వాంగ్మూలం తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు చర్య తీసుకుని కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని కస్టడీలోకి తీసుకోని దర్యాప్తు చేస్తున్నారు.