బీసీ హాస్టల్లో పురుగుల అన్నం

బీసీ హాస్టల్లో పురుగుల అన్నం
  • అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థుల ఆందోళన

మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని బీసీ బాలుర సంక్షేమ శాఖ హాస్టల్లో పురుగుల అన్నం తినలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ అన్నంలో లక్కపురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ల పప్పు, పురుగుల అన్నంతో తినలేకపోతున్నామన్నామంటున్నారు విద్యార్థులు. వడ్డించే సిబ్బందికి చూపిస్తు్న్నామని.. వార్డెన్ కు కూడా తెలియజేశామని వారు పేర్కొన్నారు. బియ్యంలో పురుగులు లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. 

రామాయంపేట కస్తూరిబాలో 4 రోజులుగా నీటి సౌకర్యం లేక అవస్థలు

మెదక్ జిల్లా రామాయంపేట కస్తూరిబా పాఠశాలలో విద్యార్థినుల పరిస్థితి దారుణంగా మారింది. నీటి సౌకర్యం లేక నాలుగు రోజులుగా విద్యార్థినులు స్నానాలు చేయలేదని చెబుతున్నారు. భోజనం సరిగా లేక ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. కూర అంతా ఏ మాత్రం రుచిపచి లేకుండా ఉంటోందని.. అన్నం ముద్ద ముద్దగా వస్తోందని.. ప్రతిరోజు దొడ్డబియ్యం ఉప్మానే టిఫిన్ పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. విషయం తెలిసి తల్లిదండ్రులు పాఠశాలను సందర్శించి ఆరా తీశారు.