సూర్యాపేటలో జస్టీస్ ఎన్వీ రమణ

సూర్యాపేటలో జస్టీస్ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.  హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేటలోని అల్పాహారం కోసం ఆగారు. సూర్యాపేటలోని సెవెన్ స్టార్ హోటల్ లో టిఫిన్ కోసం ఆగారు సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ. రమణ. ఈ సందర్భంగా ఆయనకు  జిల్లా జడ్జి బీఎస్. జగ్జివన్ కుమార్,  రెండో మెట్రో పాలిటన్ న్యాయమూర్తి వసంత పాటిల్, ప్రిన్స్ పల్ జూనియర్ న్యాయమూర్తి కె. సురేష్ , అడిషనల్ జూనియర్ జడ్జి  ప్రశాంతి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి , ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పలువురు స్వాగతం పలికారు.